https://terrafortune.com:443/news-detail/World-top-companies-to-come-to-Amaravathi/43 World top companies to come to Amaravathi - Terrafortune.com World top companies to come to Amaravathi - Terrafortune.com

World top companies to come to Amaravathi

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీలను తీసుకువచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. విద్య, వైద్యం, ఐటీ, వ్యవసాయ పరికరాల తయారీ, తదితర రంగాల్లో పేరుపొందిన సంస్థలను రాజధానికి తీసుకురావాలని ఆ కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతుంది. వివిధ రంగాలతో పాటు ఆధ్యాత్మిక సంస్థలు, కట్టడాలకు భూములిచ్చి అభివృద్ధి జరిగేలా ప్రయత్నిస్తుంది. తైవాన్‌కు చెందిన ఫాక్స్‌ కాన్‌ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్‌ పరికరాల ఉత్పత్తి సంస్థ. అమరావతిలో 1500 ఎకరాల భూమిని కేటాయిస్తే, 5 బిలియన్‌ డాలర్ల (32,500 కోట్లు) పెట్టుబడి పెడతామని ఆ సంస్థ ప్రతిపాదించినట్లు సమాచారం. చంద్రబాబు స్వయంగా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఒక్క సంస్థ ద్వారానే 3 లక్షల మంది వరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. అమరావతి నిర్మాణం కొరకు ప్రభుత్వం సేకరించిన భూమిలో మౌలిక సదుపాయాలు, రైతుల వాటా భూమిని మినహాయిస్తే 17-20 వేల ఎకరాల భూమి ఉంటుందని అంచనా. ఇందులో ప్రభుత్వ సచివాలయం, శాసనసభ, సిఎం కార్యాలయం, రాజ్‌భవన్‌, తదితర కీలక కార్యాలయాలు ఉండే కోర్‌ కాపిటల్‌ 3 వేల ఎకరాల్లో ఉంటుంది. మిగిలిన భూమిని ప్రతిష్టాత్మక సంస్థలకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. విదేశీ సంస్థలు, దేశంలో ప్రసిద్ధి గాంచిన సంస్థలను అమరావతికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం విజయదశమి రోజున రాజధాని శంకుస్థాపన రోజుకు కొన్నింటినైనా కొలిక్కితెచ్చి ప్రకటించాలని ఆలోచనలో ఉంది.

\r\n

Posted Date: 12-08-2015